TET - కోల్ బర్గ్ సిద్ధాంతం (Kohlberg's Theory) Practice Quiz
మొత్తం ప్రశ్నలు: 10
మిగిలిన సమయం:
10:00
1. కోల్ బర్గ్ ప్రకారం "శిక్ష – విధేయత వైఖరి" (Punishment and Obedience Orientation) ఏ స్థాయిలో ఉంటుంది?
A)
పూర్వ సాంప్రదాయక నైతికత (Pre-Conventional)
B)
సాంప్రదాయక నైతికత (Conventional)
C)
ఉత్తర సాంప్రదాయక నైతికత (Post-Conventional)
D)
ఏదీ కాదు
2. కార్ల్ గిల్లిగన్ (Carol Gilligan) కోల్ బర్గ్ సిద్ధాంతాన్ని ఏ అంశం ఆధారంగా విమర్శించారు?
A)
వయో పరిమితి సరిగ్గా లేకపోవడం
B)
లింగ పక్షపాతం (Gender Bias - స్త్రీల నైతికతను విస్మరించడం)
C)
సామాజిక నియమాలను పరిగణించకపోవడం
D)
భాషా వికాసాన్ని కలపకపోవడం
3. కోల్ బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మొత్తం ఎన్ని స్థాయిలు (Levels) మరియు ఎన్ని దశలు (Stages) ఉన్నాయి?
A)
4 స్థాయిలు, 8 దశలు
B)
3 స్థాయిలు, 6 దశలు
C)
2 స్థాయిలు, 4 దశలు
D)
6 స్థాయిలు, 3 దశలు
4. పిల్లవాడు "నేను ఈ పని చేస్తే నాకు ఏమి లభిస్తుంది?" (Tit for Tat) అని ఆలోచించడం ఏ దశకు చెందుతుంది?
A)
దశ 1 (Punishment-Obedience)
B)
దశ 2 (Individualism and Exchange / Instrumental Relativist)
C)
దశ 3 (Good Boy / Nice Girl)
D)
దశ 4 (Law and Order)
5. కోల్ బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఉపయోగించిన ప్రసిద్ధ కథ / సంక్షోభం ఏది?
A)
పావ్లోవ్ సంక్షోభం
B)
హింజ్ సంక్షోభం (Heinz Dilemma)
C)
స్కిన్నర్ సంక్షోభం
D)
పియాజె సంక్షోభం
6. ఇతరుల ఆమోదం పొందేందుకు మరియు "మంచి బాలుడు / మంచి బాలిక" అనిపించుకోవడానికి ప్రయత్నించే దశ ఏది?
A)
దశ 1
B)
దశ 2
C)
దశ 3
D)
దశ 5
7. సమాజంలో శాంతిభద్రతల నిర్వహణ కోసం చట్టాలు మరియు నియమాలను తప్పక పాటించాలి అని భావించే దశ ఏది?
A)
దశ 4 (Maintaining Social Order / Law and Order)
B)
దశ 1 (Punishment Orientation)
C)
దశ 6 (Universal Ethical Principles)
D)
దశ 2 (Individualism)
8. మహాత్మా గాంధీ, మదర్ థెరిసా వంటి వ్యక్తులు కోల్ బర్గ్ యొక్క ఏ నైతిక అభివృద్ధి దశకు చెందుతారు?
A)
దశ 3 (Good Interpersonal Relationships)
B)
దశ 4 (Law and Order Orientation)
C)
దశ 6 (Universal Ethical Principles)
D)
దశ 1 (Punishment and Obedience)
9. సమాజ శ్రేయస్సు కోసం అవసరమైతే చట్టాలను మార్చవచ్చని భావించే "సాంఘిక ఒప్పందం" (Social Contract) ఏ స్థాయిలో ఉంటుంది?
A)
పూర్వ సాంప్రదాయక నైతికత (Pre-Conventional)
B)
సాంప్రదాయక నైతికత (Conventional)
C)
ఉత్తర సాంప్రదాయక నైతికత (Post-Conventional)
D)
ప్రాథమిక స్థాయి
10. సాంప్రదాయక నైతికత (Conventional Morality - Level 2) సాధారణంగా ఏ వయస్సు పిల్లలలో కనిపిస్తుంది?
A)
0 - 2 సంవత్సరాలు
B)
4 - 10 సంవత్సరాలు
C)
10 - 13 సంవత్సరాలు
D)
18 సంవత్సరాల పైన
పరిక్షను సబ్మిట్ చేయండి (Submit Quiz)