Telugu Grammar and Content 24 Marks
  |
1 ) పసిడి ఛాయలో మిసమిసలాడే పేరు వినగానే నోరూరించే ఏడుపు నవ్వుగా ఇట్టే మార్చే పిల్లలు
1 ) గాలి పటం
2 ) బెల్లం లడ్డూ
3 ) నేరేడు పండు
4 ) కాకరకాయ .
|
2. " చెట్టు కోరిక " పాఠంలో మామిడి చెట్టు తొర్రలో కాపురం ఉంటున్నవి .
1 ) పక్షులు
2 ) కోతులు
3 ) చీమలు
4 ) పాములు
|
3. దేశము --- కాపాడిన వీరులు
1 ) యొక్క
2 ) వలన
3 ) కంటే
4 ) ను
|
4. కింది వాటిలో కేవలం హ్రస్వాక్షరాలతో ఏర్పడిన పదం గుర్తించండి .
1 ) ఆవు
2 ) కాగితం
3 ) యామం
4 ) అరక
|
5. పాడు కరువులకు బాణాలు మా పంట చేలకివి ప్రాణాలు ఈ గేయం వీటిని ఉద్దేశించబడింది .
1 ) మయూరాలు
2 ) చిలుకలు
3 ) వర్షాలు
4 ) సీతాకోకచిలుకలు
|
6. గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు . ఈ వాక్యంలో " పెడచెవిని పెట్టు ” జాతీయానికి అర్ధం .
1 ) విని ఆచరించడం
2 ) పూర్తిగా మునిగిపోవడం
3 ) చెప్పుచేతల్లో నడవడం
4 ) పట్టించుకోకపోవడం
|
7. కింది వాక్యానికి సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి ' అవ్వ శిష్యులకు సూదిని ఇచ్చింది '
1 ) అవ్వకు శిష్యులు ఏమిచ్చారు ?
2 ) అవ్వ శిష్యులకు ఏమిచ్చింది ?
3 ) అవ్వకు సూదిని ఎవరిచ్చారు ?
4 ) సూదిని అవ్వకు ఇచ్చిందెవరు ?
|
8. నూర్పిడి , కలుపు , ధాన్యం , నాట్లు " పదాలను వరుస క్రమంగా అమర్చిన వాటిలో సరైనది గుర్తించండి .
1 ) కలుపు , నూర్పిడి , ధాన్యం , నాట్లు 2 )
నాట్లు , కలుపు , నూర్పిడి , ధాన్యం
3 ) నాట్లు , ధాన్యం , కలుపు , నూర్పిడి
4 ) నాట్లు , నూర్పిడి , ధాన్యం , కలుపు
|
9. ఈరోజు నుండి మేమందరం మా ఇళ్లల్లో అనవసరంగా విద్యుత్తును వృథా చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నాం " ఈ వాక్యంలో ఉన్న స్పృహ
1 ) సామాజిక స్పృహ
2 ) ఆధ్యాత్మిక స్పృహ
3 ) నైతిక స్పృహ
4 ) పఠనాభిలాష స్పృహ
|
10. విహగము " అనగా ......
1 ) అవకాశాన్ని గమనించునది
2 ) ఆకాశంలో పోవునది
3 ) నీటిలో సంచరించేది
4 ) బొరియలో నివసించునది .
|
11.
" ఇది ఇలా జరిగింది " అని చెప్పే సాహిత్య ప్రక్రియ
1 ) పురాణం
2 ) శతకం
3 ) ఇతిహాసం
4 ) ప్రబంధం
|
12.
" శ్రీరామా " పదం యొక్క గణం .
1 ) మగణము
2 ) భగణము
3 ) నగణము
4 ) జగణము
|
13.
నరకంలో హరిశ్చంద్రుడు " నాటక రచయిత
1 ) సి . నారాయణరెడ్డి
2 ) నండూరి రామమోహనరావు
3 ) నార్ల వెంకటేశ్వరరావు
4 ) యస్.టి. జ్ఞానానంద కవి
|
14.
" భ్రమరం " అనగా అర్థం
1 ) నెమలి
2 ) తుమ్మెద
3 ) కోకిల
4 ) చక్రవాకం
|
15.
“ అరణ్యం ” అనే పదానికి పర్యాయపదాలు
1 ) ధరణి , గడ్డ
2 ) చిరస్థాయి , ఎల్లప్పుడూ
3 ) అడవి , విపినం
4 ) అడవి , కనుక
|
16.
“ భాషౌన్నత్యం ” పదాన్ని విడదీయగా వచ్చిన రూపం
( 1 ) భాష + ఉన్నత్యం
2 ) భాష + ఔన్నత్యం
3 ) భాష్ + ఉన్నత్వం
4 ) భాషాన్ + అత్యం
|
17.
ప్రజాచైతన్యంలో కీలకపాత్ర పోషించిన కళారూపం
1 ) ప్రబంధ
2 ) శాసనం
3 ) పురాణం
4 ) బుర్రకథ
|
18.
" షడ్రుచులు ” సమాసం పేరు .
1 ) ద్వంద్వ సమాసం
2 ) బహువ్రీహి సమాసం
3 ) అవ్వయీభావ సమాసం
4 ) ద్విగు సమాసం
|
19.
మాట్లాడే భాషకు మరొక పేరు
1 ) లిఖిత రూప భాష
2 ) సంకేత భాష
3 ) సైగల భాష
వాగ్రూప భాష
|
20.
తెలుగు కవయిత్రులలో మొదటగా రామాయణం రాసింది
1 ) తాళ్లపాక తిమ్మక్క
ఆతుకూరి మొల్ల
ముద్దు పళని
పసుపులేటి రంగాజమ్మ
|
21.
కింది గద్యాన్ని చదివి 51-52 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి . విభిన్న ఆకృతుల్లో , ఆకట్టుకునే రంగుల్లో , చూడముచ్చటగా ఉండే కొయ్యబొమ్మలకు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు . కృష్ణాజిల్లా లోని కొండపల్లి కొయ్యబొమ్మల ప్రత్యేకతే వేరు . ఆర్య క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కళాకారులు వంశపారం పర్యంగా ఈ బొమ్మలు తయారు చేస్తున్నారు . స్థానికంగా దొరికే కుమ్మర పొనికి చెక్కతో రూపొందించే ఈ బొమ్మల్లో సహజత్వం ఉట్టిపడుతుంది .
కొండపల్లి కొయ్య బొమ్మలు ఈ చెక్కతో తయారు చేస్తారు
1 ) తెల్ల పొనికి చెక్క
2 ) నల్ల పొనికి చెక్క
3 ) కుమ్మర పొనికి చెక్క
4 ) ఆళ్లగడ్డ చెక్క
|
22.
తాతముత్తాతల కాలం నుండి వస్తున్నది అని అర్థాన్నిచ్చే పదం
1 ) వంశ పారంపర్యం
2 ) పెట్టింది పేరు
3 ) ఉట్టిపడుట .
4 ) చూడముచ్చట
|
23.
కింది పద్యాన్ని చదివి 53-54 ప్రశ్నలకు జవాబులు గుర్తి ధనమును , విద్యయు , వంశం బును దుర్మతులకు , మదంబు బొనరించును స జ్జనులైన వారి కడకువ యును వినయము నివియ దెచ్చు సుర్వీనాథా ! 53. ' ధనం , విద్య , వంశం ' అనేవి వీరికి గర్వాన్ని కలిగిస్తాయి .
1 ) సజ్జనులకు
2 ) దుర్మతులకు
శిష్టులకు
4 ) ఉర్వీనాధులకు
|
24.
సజ్జనులకు, అణుకువ వినయం కలిగించేవి
ధనం, మదం, అణుకువ
అనుకువ, ఉర్వినాద, మదం
ధనం, వంశం, దుర్మదం
విద్య, వంశం, ధనం
|
  Pedagogy 6 Marks
  |
25.
విషయాన్ని గ్రహించడంలో వాగింద్రియాలకు ఏ మాత్రం శ్రమ లేకుండా , కేవలం కంటిచూపుతోనే చదవడం
1 ) బాహ్య పఠనం
2 ) ప్రకాశ పఠనం
3 ) మౌన పఠనం
4 ) శబ్ద పఠనం
|
26.
ఒక విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకొనే బోధనా ప్రణాళిక
1 ) విద్యా ప్రణాళిక
2 ) సంస్థాగత ప్రణాళిక
3 ) విషయ ప్రణాళిక
4 ) వార్షిక ప్రణాళిక
|
27.
ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది
1 ) ప్రణాళిక
2 ) మూల్యాంకనం
3 ) అభ్యసనస్థాయి
4 ) అనుప్రయుక్తం
|
28.
" పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష " అని నిర్వచించినవారు .
1 ) ఇల్లర్
2 ) హాకెట్
3 ) సైమన్పటర్
4 ) మహాత్మాగాంధీ
|
29.
తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవి .
1 ) బోధనోపకరణాలు
2 ) పరీక్షలు
3 ) సంవృత లక్ష్యాలు
4 ) వివృత లక్ష్యాలు
|
30.
“ వక్తృత్వం " అనగా
1 ) రాయడం
2 ) మాట్లాడటం
3 ) వినడం
4 ) సమీక్ష
|